
పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
పుదుచ్చెరిలోని తట్టాన్చావిడి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ అభ్యర్థి అశోక్ ఆనంద్ 8400 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వినాయగంపై విజయం సాధించారు. సీఎం ఎన్. రంగస్వామికి చెందిన ఏఐఎన్ఆర్సీ పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. ఈ సీటు సీఎం రంగస్వామి రాజీనామాతో ఖాళీ అయింది. తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం, పశ్చిమ బెంగాల్లోని రెజినగర్, నందిగ్రామ్, అస్సాంలోని నాగావ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.




