న్యూజిల్యాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను
భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో
భారత్ నిర్ధేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ ఛేదించలేకపోయింది. 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. డీన్(31), నిక్ కెల్లి(24), మిచెల్ సాంట్నర్(24), విల్ యంగ్(22), టిమ్ సీఫెర్ట్(14), మిచెల్ బ్రేస్‌వెల్(19), పరుగులు చేశారు. భారత బౌలర్లు అర్షదీప్ 3, సిరాజ్, అక్షర్ చెరో రెండు, అకిబ్, యశ్, నమన్ ధీర్ తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత ప్లేయర్లు అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) మినహా మిగతా బ్యాటర్లు నిరాశపర్చారు. అయినప్పటికీ బౌలింగ్‌తో కట్టడి చేసి విజయాన్ని అందించారు.