
స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలు జరిగాయి: వైఎస్ జగన్ (VIDEO)
స్పోర్ట్స్ కోటా పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, 2 శాతం కోటాను 3 శాతానికి పెంచి, పరీక్ష లేకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేలా జీవో నంబర్ 4, 47లను జారీ చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. తమ పని పూర్తయ్యాక వెంటనే జీవో నంబర్ 23, 25, 56లతో ఆ నిబంధనలను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జరగని క్రీడా పోటీలు జరిగినట్లు, నకిలీ సర్టిఫికెట్లతో పోస్టులు కట్టబెట్టారని మండిపడ్డారు.




