భారత్ గర్వపడుతోంది.. ప్రజ్ఞానందపై అదానీ ప్రశంసలు

4067చూసినవారు
భారత్ గర్వపడుతోంది.. ప్రజ్ఞానందపై అదానీ ప్రశంసలు
20 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ స్పాన్సర్‌గా ఉన్న ప్రజ్ఞానందను అభినందిస్తూ, 'నిర్భయంగా, ఏకాగ్రతతో సిసలైన భారత ఛాంపియన్‌గా నిలిచావు. కంగ్రాట్స్ ప్రజ్ఞానంద. నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌ నువ్వు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వేదికపై అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించడం అద్భుతమైన ఘనత. నీ ఆటతీరుతో దేశం గర్వపడేలా చేశావు ప్రగ్' అని పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్