క్రికెట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భారత జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బ్యాటర్ ఇషాన్ కిషన్ పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి ఓవర్ ముగిసే సమయానికి టీమ్ఇండియా 8 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ కొనసాగిస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.