ఆహార వృథాలో భారత్ రెండో స్థానం: ఐరాస

6చూసినవారు
ఆహార వృథాలో భారత్ రెండో స్థానం: ఐరాస
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆహార వృథాపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) తాజాగా కీలక నివేదికను విడుదల చేసింది. మొత్తం ఆహార వృథా పరిమాణం పరంగా చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. మనదేశంలో ఏటా ఒక వ్యక్తి సగటున 55 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు దక్షిణ కొరియా అనుసరిస్తున్న 'పే యాజ్ యూ త్రో' విధానం ఆదర్శంగా నిలుస్తోంది. వృథాను తగ్గించేందుకు ప్రభుత్వం, ప్రజలు ఉమ్మడి బాధ్యత తీసుకోవాలని నివేదిక సూచించింది.

సంబంధిత పోస్ట్