పాక్‌పై భారత్ ఘన విజయం

1457చూసినవారు
పాక్‌పై భారత్ ఘన విజయం
మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు దాయాది పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 8.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలీ వర్మ 12, స్మృతి మంధాన 9, కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 18*, దీప్తి శర్మ 12* పరుగులు చేశారు. ఈ విజయంతో భారత జట్టు టోర్నమెంట్‌లో తమ ప్రస్థానాన్ని పటిష్టంగా ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్