
మాదాపూర్‌లో నాలాలో పడ్డ జెప్టో డెలివరీ బాయ్.. తృటిలో తప్పిన ప్రమాదం
TG: హైదరాబాద్‌లోని మాదాపూర్ విఠల్ రావు నగర్ వద్ద శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర ప్రమాదం జరిగింది. జెప్టో డెలివరీ బాయ్ అర్జున్ కుమార్ (46) తన బైక్‌పై వెళ్తుండగా వరద ఉధృతికి అదుపుతప్పి పక్కనే ఉన్న నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి, చాకచక్యంగా సహాయక చర్యలు చేపట్టి అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో నాలాలు, వరద నీరు ప్రవహించే చోట వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.




