రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో
భారత్-ఏ 306 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు, భారత బౌలర్ల ధాటికి కేవలం 11.3 ఓవర్లలో 26 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్
ప్రిన్స్ యాదవ్ 5 వికెట్లు, హర్షిత్ రాణా 4 వికెట్లు, షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తూ
భారత్-ఏ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.