భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో రూ. 1,976 కోట్ల విలువైన కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత యుద్ధ నౌకల్లోని బరాక్ పాయింట్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ చర్యతో భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) యాంటీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారనుంది. రక్షణ రంగంలో ఈ ఒప్పందం భారత సామర్థ్యాలను గణనీయంగా పెంచే కీలక అడుగుగా నిలుస్తోంది.