న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా
భారత్ తొలి మ్యాచ్‌ను గురువారం, నవంబర్ 19న వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో ఆడనుంది. 2024లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో గిల్ సేన బరిలోకి దిగుతోంది. ఉదయం 03:00 గంటలకు టాస్ పడనుండగా.. 03:30 గంటలకు ఆట మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ను సోనీ టెన్ ఛానెల్స్, సోనీ లివ్ యాప్‌లో చూడవచ్చు.