భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య ఈ నెల 14న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న నాలుగో
టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హెచ్‌సీఏ కార్యదర్శి ఎం. జీవన్‌రెడ్డి, స్పోర్ట్స్ పర్సన్ శశి నారాయణ్, సీఈఓ ఇంతియాజ్ ఖాన్ మ్యాచ్ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. మ్యాచ్ కోసం మొత్తం 34 వేల టికెట్లను అందుబాటులో ఉంచగా, ఇప్పటివరకు 12 వేల టికెట్లు విక్రయించినట్లు తెలిపారు. టికెట్ ధరలు రూ.750 నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయని, ఒక్కొక్కరు గరిష్ఠంగా నాలుగు టికెట్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.