న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీనివల్ల డక్వర్త్ లూయిస్ (DLS) పద్ధతిని అమలు చేసి, టీమ్ ఇండియాను విజేతగా అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 30, రోహిత్ శర్మ 23, నమన్ ధీర్ 12, రాహుల్ 26 పరుగులతో రాణించారు. తదుపరి మూడో వన్డే నవంబర్ 10న జరగనుంది.