16 ఏళ్ల తర్వాత భారత్‌కు మెడల్‌

61చూసినవారు
16 ఏళ్ల తర్వాత భారత్‌కు మెడల్‌
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్‌ సీమ 10వేల మీటర్ల రేసింగ్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. ఆమె ఈ పరుగును 32:50.05 నిమిషాల్లో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్‌కు చెందిన విన్‌ప్రెడ్‌ యవీ స్వర్ణం, జపాన్‌కు చెందిన నొజోమీ తనకా రజతాన్ని కైవసం చేసుకున్నారు. సీమ స్వర్ణ పతక విజేత కంటే 10.87 సెకన్లు మాత్రమే వెనకబడింది. ఆసియన్ గేమ్స్‌లో మహిళల 10,000 మీటర్ల ఈవెంట్‌లో భారత్‌కు పతకం దక్కడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్