ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 10 వేల మీటర్ల ఈవెంట్లో రజత పతకం సాధించాడు. అతను 28:29.38 నిమిషాల్లో రేసును పూర్తి చేశాడు. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బాల్యూ స్వర్ణం గెలుచుకున్నాడు. గుల్వీర్ సింగ్ కేవలం 1.87 సెకన్ల తేడాతో స్వర్ణాన్ని కోల్పోయాడు. మరో భారత క్రీడాకారిణి మన్‌ప్రీత్ కౌర్ షాట్‌పుట్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.