భారత క్రికెటర్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ శనివారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. OBC మోర్చా ప్రెసిడెంట్ అమర్పాల్ మౌర్య సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు
బీజేపీ జాతీయ ఓబీసీ (OBC) మోర్చా కార్యవర్గంలో స్పెషల్ ఇన్వైటీగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ప్రకటించారు. కాగా చాహల్ ఇంటర్నేషనల్
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించకముందే రాజకీయాల్లోకి రావడం చర్చనీయాంశం అవుతోంది.