
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి (VIDEO)
అమెరికాలోని డాలస్ నగరంలో హాలోవీన్ వేడుకల సందర్భంగా జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయని డాలస్ పోలీస్ చీఫ్ డేనియల్ కమాక్స్ తెలిపారు. నగరం మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. డీప్ ఎలమ్ ఘటనతో వీటికి సంబంధం ఉందేమోనని అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.




