హరియాణాకు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్పురియాలను అమెరికాలో ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హిమాన్షుపై ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో 18 కేసులు ఉండగా, నీరజ్‌పై 25కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2020లో బాలల సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకున్న హిమాన్షు విదేశాలకు పారిపోయాడు. ఈ నేపథ్యంలోనే 2023లో ఇంటర్‌పోల్ అతడిపై రెడ్ నోటీసులను జారీ చేసింది. పరారీలో ఉన్న వీరిద్దరిని అమెరికాలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.