ఆసియా క్రీడల మహిళల
క్రికెట్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. జపాన్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళా జట్టు కేవలం 5 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ శ్రీ చరణి 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 ఓవర్లలో 59 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది.