దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. రోజంతా మోస్తరు శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్ స్వల్ప నష్టాల్లో, నిఫ్టీ లాభాల్లో స్థిరపడింది. మెటల్ స్టాక్స్ రాణించాయి. సెన్సెక్స్ 19.63 పాయింట్ల నష్టంతో 74,294.96 వద్ద ముగియగా, నిఫ్టీ 75.80 పాయింట్ల లాభంతో 23,346.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.49గా ఉంది.
టీసీఎస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.