దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు, బాండ్ రాబడులు పెరగడం వంటి కారణాలతో గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలను చవిచూసిన సూచీలు, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు తగ్గడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. సెన్సెక్స్ 472.77 పాయింట్లు లాభపడి 72,382.47 వద్ద, నిఫ్టీ 133.80 పాయింట్లు పెరిగి 22,555.75 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర 102.43 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4,157.47 డాలర్లుగా ఉంది.