స్వదేశీ బర్డ్‌ఫ్లూ వ్యాక్సిన్ విడుదల (VIDEO)

21చూసినవారు
భోపాల్‌లో కోళ్ల కోసం రూపొందించిన తొలి స్వదేశీ బర్డ్‌ఫ్లూ (H5N1) టీకాను శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. దేశంలో వ్యాపించే హెచ్5ఎన్‌1 క్లేడ్ 2.3.2.1ఎ స్ట్రెయిన్‌ను అరికట్టేలా ఈ ఇన్యాక్టివేటెడ్ టీకా పనిచేస్తుంది. దీనివల్ల పౌల్ట్రీ రైతుల ఆర్థిక నష్టాలు తగ్గి, కోళ్లకు వైరస్ నుండి రక్షణ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్