శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఇండిగో
విమానం ప్రమాదానికి గురైంది. నవీ ముంబయి నుంచి శ్రీనగర్ చేరుకున్న 6E 225
విమానం పార్కింగ్ బేకు వెళ్తుండగా విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) స్తంభాన్ని ఢీకొట్టింది. ఉదయం 9.02 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.