TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులకు రూ.5 లక్షల బీమా అందించనుంది. రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం ప్రత్యేక నమోదు శిబిరాలను ఏర్పాటు చేయనుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. దరఖాస్తు సమయంలో బీమా పొందే వ్యక్తి ఆధార్ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ వివరాలు అందించాలి. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.