ఇందిరమ్మ ఇళ్లు: రూ. 3.50 లక్షలకే సొంత ఫ్లాట్

0చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లు: రూ. 3.50 లక్షలకే సొంత ఫ్లాట్
TG: అర్హులైన పేదలకు తక్కువ ధరకే ఇళ్లను అందించేందుకు 'ఇందిరమ్మ టవర్ల' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్ల పరిధిలో మొదటి విడతగా 2400 ఫ్లాట్లను రూ. 3.50 లక్షలకే కేటాయించనున్నారు. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లించే అవకాశం ఉంది. దరఖాస్తుకు రూ. 100 రుసుము, రూ. 10 వేల అడ్వాన్స్ చెల్లించాలి. దరఖాస్తుదారులకు సొంతిల్లు ఉండకూడదు, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల్లోపు ఉండాలి. లబ్ధిదారులు పదేళ్ల వరకు ఈ ఫ్లాట్లను అమ్మడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి వీలుండదు.

సంబంధిత పోస్ట్