TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో గంగమ్మ తల్లికి 'ఇందిరమ్మ చీర' కట్టడం చర్చనీయాంశమైంది. దైవ కార్యాలను రాజకీయాలకు వాడుకోవడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను విస్మరించి దేవతామూర్తులకు రాజకీయ రంగులు పులమడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఆలయ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి వివరణ ఇవ్వాలని భక్తులు, పలువురు డిమాండ్ చేస్తున్నారు.