తెలంగాణలో అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 19న జరిగే సిద్ధిపేట సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం చీరలను వెంటనే అన్ని జిల్లాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పంపిణీలో జాప్యం జరగకుండా జిల్లా యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. అర్హులైన ప్రతి మహిళకు పథకం ప్రయోజనం అందేలా చూడాలని స్పష్టం చేశారు.