శత్రు దేశాల సబ్‌మెరైన్ కదలికలను గుర్తించి.. వాటిపై దాడి చేసే సామర్థ్యం ఉన్న యాంటీ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ మాంగ్రోల్ భారత నౌకాదళంలోకి అడుగుపెట్టింది. తీర ప్రాంత కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా కొచ్చిన్ షిప్‌యార్డ్ ఈ నౌకను నిర్మించింది. పోర్టులు, హార్బర్‌లకు నీటి అడుగు భాగం నుంచి ఎదురయ్యే ముప్పులను గుర్తించి నిరోధించనుంది. అలాగే నేవీ సామర్థ్యాన్ని మరింత పెంచనుంది.