
రామ్ చరణ్, ఓం రౌత్ కాంబోలో భారీ చిత్రం?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'తానాజీ' వంటి చిత్రాలతో సత్తా చాటిన దర్శకుడు ఓం రౌత్ కలయికలో ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రం రాబోతోందని సమాచారం. ఇటీవల ఓం రౌత్ చరణ్కు కథ వినిపించగా, కాన్సెప్ట్ నచ్చి ప్రాథమికంగా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, 'ఆదిపురుష్' డిజాస్టర్ తర్వాత ఓం రౌత్ చిత్రాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ విశ్లేషకులకు ఒక సాహసంగా కనిపిస్తోంది. ఈ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




