తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక థియరీ పరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి ని
ర్వహించేందుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కూడా తొలిసారిగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 9 వరకు గడువు ఉంది. ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును నవంబర్ 13 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.