వడ్డీ రేట్ల పెంపు.. నష్టాల్లో ముగిసిన సూచీలు

2చూసినవారు
వడ్డీ రేట్ల పెంపు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుసగా రెండు సెషన్ల లాభాల ర్యాలీకి బ్రేక్‌ పడింది. ఆర్‌బీఐ రెపో రేటును 5.5%కి పెంచడంతో మెటల్‌, రియాల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్‌ 429.11 పాయింట్లు నష్టపోయి 72,638.70 వద్ద ముగియగా.. నిఫ్టీ 173.05 పాయింట్లు పతనమై 22,603.05 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.77గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 101.93 డాలర్ల వద్ద, బంగారం ఔన్స్‌ ధర 4,116.41 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్