యాపిల్ సంస్థ తన స్మార్ట్ఫోన్ ఐఫోన్ ప్రవేశపెట్టి 20 ఏళ్లు పూర్తికానున్న వేళ, వచ్చే ఏడాది ఐఫోన్ 20 ప్రో మోడల్లో భారీ మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధానంగా ఈ మోడల్లో 3D క్వాడ్ కర్వ్ డిస్ప్లేను అమర్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎడమవైపు ఉన్న యాక్షన్ బటన్ను తొలగించి, ఆ ఫీచర్లను కుడివైపున ఉండే కెమెరా కంట్రోల్ బటన్లలో విలీనం చేసే అవకాశం ఉంది. కెమెరా క్వాలిటీని మరింత మెరుగుపరిచేందుకు యాపిల్ సంస్థ ప్రత్యేకమైన సెన్సార్ను కూడా డిజైన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.