
కన్నబిడ్డల నిర్లక్ష్యం.. అనాథగా మారిన తల్లికి గ్రామస్తుల అంతిమ వీడ్కోలు
TG: జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన నాగబండి పుష్పనీల (70) అనే వృద్ధురాలికి.. సంతానం ఉన్నప్పటికీ ఎవరూ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నా చివరి సమయంలో ఆమె ఒంటరిగా కన్నుమూశారు. కన్నబిడ్డలు బాధ్యత తీసుకోకపోవడంతో, మానవత్వం చాటుకున్న గ్రామస్తులే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.




