ఐపీఎల్-2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారైంది. 2026 డిసెంబర్ 16న గోవాలో వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేలంలో మొత్తం 184 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. వీరిలో 55 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అన్ని ఫ్రాంచైజీలకు కలిపి రూ.297.95 కోట్ల పర్స్ మనీ అందుబాటులో ఉంది. మొత్తం 66 ఆటగాళ్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ వేలంలో ఏయే ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకుంటాయోనని
క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.