
దీపావళికి టపాసులపై పూర్తి నిషేధం లేదు...సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దీపావళి సందర్భంగా టపాసులపై పూర్తి నిషేధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రజల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేసింది. రోజంతా టపాసులు కాల్చడంపై ఆంక్షలు కొనసాగుతాయని, వృద్ధులు, పిల్లల ఆరోగ్యం కోసం నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.




