అమెరికా ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ ప్రకటన

0చూసినవారు
హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సోమవారం ధ్రువీకరించింది. అయితే, డ్రోన్ లక్ష్యంపై వివరాలు వెల్లడించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ చమురుపై తమకు పట్టు లభించే వరకు యుద్ధం కొనసాగుతుందని, వెనెజువెలా మాదిరిగానే ఇరాన్ చమురు బావులను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని వ్యాఖ్యానించారు. దాదాపు 7 నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధం ఈ సంవత్సరంలోనే ఆగుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్