
కుక్క కరిచినా రక్తం రాలేదని నిర్లక్ష్యం చేస్తున్నారా?
ప్రతి ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహిస్తారు. కుక్క కరిచినప్పుడు రక్తం రాకపోతే చాలామంది ప్రమాదం లేదని భావిస్తారు. కానీ, ఇది అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తం రాకపోయినా రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. చర్మంపై చిన్న గీతలు, రాపిడి లేదా జంతువు లాలాజలం చర్మం లోపలికి చేరినా వైరస్ సోకే అవకాశం ఉంది. WHO ప్రకారం, రక్తం రాకుండా చర్మం గీసుకుపోయినా టీకా తప్పనిసరి. కుక్క కరిచిన వెంటనే సబ్బుతో 15 నిమిషాలు కడిగి, యాంటిసెప్టిక్ రాసి, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.




