2000 కిలోమీట‌ర్ల రేంజ్ ఉన్న క్షిప‌ణిని ప్ర‌యోగించిన ఇరాన్ (వీడియో)

9651చూసినవారు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ ఆరో రోజూ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు కొనసాగించింది. సుమారు 2000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఖొర్రంషహర్-4 క్షిపణిని టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం వైపు ప్రయోగించినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అలాగే వైమానిక దళానికి చెందిన 27వ స్క్వాడ్రన్ బేస్‌పై కూడా దాడి చేశామని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఈ ప్రకటనలను ఖండించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎక్కువ క్షిపణులను అడ్డుకున్నాయని, ఒకటి మాత్రమే ఖాళీ ప్రదేశంలో పడిందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్