బిర్యానీలో ఇనుప తీగ

1చూసినవారు
బిర్యానీలో ఇనుప తీగ
TG: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో బిర్యానీలో ఇనుప తీగ కనిపించింది. ఓ మాజీ ప్రజాప్రతినిధి బిర్యానీ తింటుండగా ఈ విషయం బయటపడింది. దీనిపై యజమానికి ఫిర్యాదు చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పుర కమిషనర్‌ అభిలాష్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. యజమానిని మందలించి రూ.2 వేల జరిమానా విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్