హిప్పో పాలు గులాబీ రంగులో ఉంటాయా?.. అసలు నిజం ఇదే!

13చూసినవారు
హిప్పో పాలు గులాబీ రంగులో ఉంటాయా?.. అసలు నిజం ఇదే!
హిప్పో పాలు గులాబీ రంగులో ఉంటాయని సోషల్‌ మీడియాలో చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది అపోహేనని చెబుతున్నారు. హిప్పో పాలు సాధారణంగానే తెల్లగా ఉంటాయి. హిప్పో చర్మ గ్రంథుల నుంచి ‘హిప్పోసుడోరిక్‌ యాసిడ్‌’తో పాటు మరో వర్ణద్రవ్యం కలిగిన ద్రవాలు విడుదలవుతాయి. వీటిని కొన్నిసార్లు ‘బ్లడ్‌ స్వెట్‌’ అని పిలుస్తారు. ఇవి రక్తం లేదా చెమట కాదు. ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంతోపాటు సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో ఈ ద్రవాలు సహాయపడతాయి. ఈ ఎరుపు-నారింజ ద్రవాల కారణంగానే హిప్పో పాలు గులాబీ రంగులో ఉంటాయన్న అపోహ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్