దసరా పండుగ తర్వాత, అక్టోబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. బెంగళూరు, కోల్కతా వంటి కొన్ని నగరాల్లో విజయదశమి, దుర్గాపూజల కారణంగా సెలవులు ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఈ సెలవు వర్తించదని అధికారులు తెలిపారు. అదేవిధంగా, అక్టోబర్ 24వ తేదీన నాలుగో శనివారం, అక్టోబర్ 25న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.