
నోయిడాలో ఐదు దుకాణాల్లో చెలరేగిన మంటలు.. ఒకరు మృతి
ఉత్తరప్రదేశ్లోని నోయిడా సెక్టార్ 125లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయ్పూర్ ప్రాంతంలోని తాత్కాలిక టీ, స్నాక్స్ దుకాణాల్లో చెలరేగిన మంటలు ఐదు దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనాస్థలిలో పెద్ద సంఖ్యలో ఎల్పీజీ సిలిండర్లు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చేపట్టారు.




