ఇజ్రాయల్‌ సింగర్ నోట హనుమాన్ చాలీసా (VIDEO)

1చూసినవారు
దుబాయ్ విమానంలో తీవ్ర గాయాలతోనూ విరోచితంగా పోరాడి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన గాయకుడు బెన్ రైవిట్జ్, స్మిత్ త్వరగా కోలుకోవాలని హనుమాన్ చాలీసా పఠించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో విమానాన్ని నియంత్రిస్తూ స్మిత్ హనుమాన్ చాలీసా పఠించినట్లు తెలుసుకున్న రైవిట్జ్, ఆయనను భారత హీరోగా అభివర్ణిస్తూ ఈ వీడియోను అంకితం చేశారు.

సంబంధిత పోస్ట్