
పైలట్ అస్వస్థత.. బెంగళూరు విమానం మస్కట్కు దారి మళ్లింపు
దోహా నుండి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో ఒక పైలట్ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, విమానాన్ని ఒమన్లోని మస్కట్కు అత్యవసరంగా మళ్లించారు. మస్కట్ విమానాశ్రయంలో దిగిన వెంటనే వైద్య బృందం సదరు సిబ్బందికి చికిత్స అందించగా, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఇండిగో సంస్థ తెలిపింది. ప్రయాణికులను బెంగళూరుకు చేర్చడానికి ఇండిగో మరో విమానాన్ని, కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసి, వారికి రిఫ్రెష్మెంట్స్ కూడా అందించింది.




