ఈజిప్టులోని కైరోలో జరుగుతున్న ISSF వరల్డ్ కప్ పోటీల్లో భారత షూటర్ ఉదయ్‌వీర్ సిద్దు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 240.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఆయన, జర్మనీ ఆటగాడు రెయిట్జ్ (240.1 పాయింట్లు)ను వెనక్కి నెట్టారు. ఇటలీకి చెందిన పావోలో మొన్నా 219.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించారు.