దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకంతో దానిని బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరమని అటవీశాఖ స్పష్టం చేసింది. పాలపిట్ట ఎగరకుండా రెక్కలు కత్తిరించడం, కాళ్లకు దారాలు కట్టడం, రెక్కలకు జిగురు పూయడం వంటి చర్యలు క్రూరమైనవని పేర్కొంది. డబ్బుల కోసం జనసమ్మర్ద ప్రాంతాల్లో పక్షులను ప్రదర్శిస్తే 1800-425-5364 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరింది. పాలపిట్టను రక్షించి తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చింది.