ఇటలీకి చెందిన ప్రీమియం స్కూటర్ల తయారీ సంస్థ ఇటాల్జెట్ త్వరలో భారత్లోకి ప్రవేశించనుంది. ఇందుకోసం కొల్హాపూర్కు చెందిన మోటోహాస్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డ్రాగ్స్టర్ సిరీస్ స్కూటర్లకు పేరుగాంచిన ఈ సంస్థ, భారత్లో విడుదల చేయనున్న మోడళ్లు, ధరలు, లాంచ్ వివరాలను నవంబర్లో జరిగే EICMA 2026 మోటార్ షోలో వెల్లడించనుంది. డ్రాగ్స్టర్ 125, 300 మోడళ్లు భారత్కు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సంస్థ రాకతో ప్రీమియం స్కూటర్ల విభాగంలో పోటీ పెరగనుంది.