జగిత్యాల జిల్లా - Jagtial

ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఆటో డ్రైవర్

TG: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఇద్దరు మైనర్ బాలికలను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపాడుకు చెందిన బాలికలు, దసరా సెలవులకు ఊట్కూరులోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. నకిరేకల్‌లో వారిని నమ్మించి ఆటో ఎక్కించుకున్న డ్రైవర్, నిర్మానుష్య ప్రాంతం వైపు మళ్లించాడు. భయంతో కేకలు వేస్తూ బాలికలు ఆటో నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. బైకర్లు బాలికలను రక్షించి నకిరేకల్ పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వీడియోలు


తెలంగాణ
ఆడపిల్ల పుట్టిందని.. పసికందును అతిక్రూరంగా చంపిన తల్లిదండ్రులు
Oct 11, 2026, 03:10 IST/

ఆడపిల్ల పుట్టిందని.. పసికందును అతిక్రూరంగా చంపిన తల్లిదండ్రులు

Oct 11, 2026, 03:10 IST
గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాలో మూడో సంతానంగా ఆడపిల్ల పుట్టిందనే కక్షతో కన్నతల్లిదండ్రులే పసికందును పొట్టనబెట్టుకున్నారు. అక్టోబర్ 7న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే పాపను ప్లాస్టిక్ సంచిలో పెట్టి, ఇటుకలతో కట్టి చెరువులో పడేసి హత్య చేశారు. ఇప్పటికే ఒక కొడుకు, ఒక కూతురు ఉండటంతో మూడో సంతానంగా పుట్టిన ఆడపిల్ల తమకు వద్దనే దురాలోచనతో కన్నతల్లిదండ్రులైన సురేశ్ రథ్వా, సంగీతాబెన్ రథ్వా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.