
ధర్మపురిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాల ( నైట్ కాలేజ్) ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి బతుకమ్మ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అలంకరించడం తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు. ఈ పండుగ మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.

























