
ఎంపీ నిధుల ద్వారా హైమాస్ట్ లైట్లు మంజూరు.
జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్లపల్లి, రాయికల్ టౌన్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ నిధుల ద్వారా హైమాస్ట్ లైట్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి అందజేయడం జరిగింది. గ్రామంలో రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు కల్పించడంతో పాటు ప్రజలకు భద్రత, సౌకర్యం కల్పించేందుకు ఈ హైమాస్ట్ లైట్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. గ్రామ అభివృద్ధికి సహకరించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కుర్మామల్లారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.



































